మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Sri Bala Manasa Puja Stotram – శ్రీ బాలా మానసపూజా స్తోత్రం


ఉద్యద్భానుసహస్రకాంతిమరుణక్షౌమాంబరాలంకృతాం
గంధాలిప్తపయోధరాం జపవటీం విద్యామభీతిం వరమ్ |
హస్తాబ్జైర్దధతీం త్రిణేత్రవిలసద్వక్త్రారవిందశ్రియం
దేవీం బద్ధహిమాంశురత్నమకుటాం వందేఽరవిందస్థితామ్ || 1 ||

ఏణధరాశ్మకృతోన్నతధిష్ణ్యం
హేమవినిర్మితపాదమనోజ్ఞమ్ |
శోణశిలాఫలకం చ విశాలం
దేవి సుఖాసనమద్య దదామి || 2 ||

ఈశమనోహరరూపవిలాసే
శీతలచందనకుంకుమమిశ్రమ్ |
హృద్యసువర్ణఘటే పరిపూర్ణం
పాద్యమిదం త్రిపురేశి గృహాణ || 3 ||

లబ్ధభవత్కరుణోఽహమిదానీం
రక్తసుమాక్షతయుక్తమనర్ఘమ్ |
రుక్మవినిర్మితపాత్రవిశేషే-
-ష్వర్ఘ్యమిదం త్రిపురేశి గృహాణ || 4 ||

హ్రీమితి మంత్రజపేన సుగమ్యే
హేమలతోజ్జ్వలదివ్యశరీరే |
యోగిమనః సమశీతజలేన
హ్యాచమనం త్రిపురేఽద్య విధేహి || 5 ||

హస్తలసత్కటకాది సుభూషాః
ఆదరతోఽంబ వరోప్య నిధాయ |
చందనవాసితమంత్రితతోయైః
స్నానమయి త్రిపురేశి విధేహి || 6 ||

సంచితమంబ మయా హ్యతిమూల్యం
కుంకుమశోణమతీవ మృదు త్వమ్ |
శంకరతుంగతరాంకనివాసే
వస్త్రయుగం త్రిపురే పరిధేహి || 7 ||

కందలదంశుకిరీటమనర్ఘం
కంకణకుండలనూపురహారమ్ |
అంగదమంగులిభూషణమంబ
స్వీకురు దేవి పురాధినివాసే || 8 ||

హస్తలసద్వరభీతిహముద్రే
శస్తతరం మృగనాభిసమేతమ్ |
సద్ఘనసారసుకుంకుమమిశ్రం
చందనపంకమిదం చ గృహాణ || 9 ||

లబ్ధవికాసకదంబకజాతీ-
-చంపకపంకజకేతకయుక్తైః |
పుష్యచయైర్మనసాముచితైస్త్వాం
అంబ పురేశి భవాని భజామి || 10 ||

హ్రీం‍పదశోభిమహామనురూపే
ధూరసి మంత్రవరేణ మనోజ్ఞమ్ |
అష్టసుగంధరజఃకృతమాద్యే
ధూపమిమం త్రిపురేశి దదామి || 11 ||

సంతమసాపహముజ్జ్వలపాత్రే
గవ్యఘృతైః పరివర్ధితదేహమ్ |
చంపకకుడ్మలవృంతసమానం
దీపగణం త్రిపురేఽద్య గృహాణ || 12 ||

కల్పితమద్య ధియాఽమృతకల్పం
దుగ్ధసితాయుతమన్నవిశేషమ్ |
మాషవినిర్మితపూపసహస్రం
స్వీకురు దేవి నివేదనమాద్యే || 13 ||

లంఘితకేతకవర్ణవిశేషైః
శోధితకోమలనాగదలైశ్చ |
మౌక్తికచూర్ణయుతైః క్రముకాద్యైః
పూర్ణతరాంబ పురస్తవ పాత్రీ || 14 ||

హ్రీం‍త్రయపూరితమంత్రవిశేషం
పంచదశీమపి షోడశరూపమ్ |
సంచితపాపహరం చ జపిత్వా
మంత్రసుమాంజలిమంబ దదామి || 15 ||

శ్రీం‍పదపూర్ణమహామనురూపే
శ్రీశివకామమహేశ్వరహృద్యే |
శ్రీగుహవందితపాదపయోజే
బాలవపుర్ధరదేవి నమస్తే || 16 ||

ఇతి శ్రీ బాలా మానస పూజా స్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.